Advertisement
Advertisement
Abn logo
Advertisement

పుణెపై జైపూర్‌ విజయం

బెంగళూరు: స్టార్‌ రైడర్‌ అర్జున్‌ దేశ్వాల్‌ 11 పాయింట్లతో సత్తా చాటడంతో ప్రొ. కబడ్డీ లీగ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పుణెరి పల్టన్‌ 31-26తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ను ఓడించింది. డిఫెండర్లు సందీప్‌ ధుల్‌, సాహుల్‌ కుమార్‌ చెరో నాలుగు పాయింట్లతో అర్జున్‌కు అండగా నిలిచారు. పుణె జట్టులో అస్లాం ఇనాందార్‌ (6), పంకజ్‌ (4), నితిన్‌ తోమర్‌ (4) రాణించారు. మ్యాచ్‌ 12వ నిమిషంలోనే ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసిన జైపూర్‌ 14-6తో ఆధిక్యంలో నిలిచింది. అయితే పుంజుకున్న పుణె త్వరితగతిన రైడ్‌ పాయింట్లు రాబట్టడంతో ప్రథమార్థం ముగిసే సరికి జైపూర్‌ ఆధిక్యం 18-17కి తగ్గిపోయింది. కానీ ద్వితీయార్థంలో అర్జున్‌ దూకుడుకు సందీప్‌, సాహుల్‌ తోడవడంతో మ్యాచ్‌ జైపూర్‌ వశమైంది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 41-37 స్కోరుతో బెంగాల్‌ వారియర్స్‌పై నెగ్గింది.  

Advertisement
Advertisement