Abn logo
Jan 21 2021 @ 12:05PM

గాయకుడు హరిహరన్ డైమండ్ నెక్లెస్ మాయం

జైపూర్: రాజస్థాన్ పర్యటనలో ప్రముఖ గాయకుడు హరిహరన్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. రాజస్థాన్‌లో తన పర్యటన ముగించుకుని ముంబైకు వెళ్లేందుకు హరిహరన్ జైపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సమయంలో ఎయిర్‌పోర్టులో హరిహరన్ మెడలోని డైమండ్ నెక్లెస్ మాయమయ్యింది. హరిహరన్ ఎంతగా వెదికినప్పటికీ నెక్లెస్ దొరకలేదు. ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ చెకింగ్ సమయంలో నెక్లెస్ మాయమైందని హరిహరన్ గుర్తించారు. వెంటనే హరిహరన్ మేనేజన్ చేతన్ గుప్తా... జవహర్ సర్కిల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎయిర్ పోర్టులోని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement
Advertisement