Abn logo
Apr 15 2021 @ 00:00AM

అబ్బురపరిచే నిర్మాణశైలి!

కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించిన జైన దేవాలయం అది. ఆ ఆలయ నిర్మాణశైలిని చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. దాదాపు యాభై ఏళ్లపాటు నిర్మాణం జరుపుకొన్న ఆ ఆలయ విశేషాలు ఇవి...


  1. రాజస్థాన్‌లో పాలి జిల్లాలోని రణక్‌పూర్‌ గ్రామంలో, ఆరావళి పర్వత శ్రేణుల సమీపంలో ఈ జైన దేవాలయం ఉంది. ఈ ఆలయం నిర్మాణంలో అద్భుతమైన శిల్పాకళా నైపుణ్యంతో చెక్కిన 1444 రాతి స్తంభాలను ఉపయోగించారు. ఇందులో ఏ రెండూ స్తంభాలు ఒకలా ఉండవు. ఒక్కో రాతి స్తంభం ఒక్కో ఆకృతిలో మలచబడి ఉంటుంది. స్తంభాలపై చెక్కిన శిల్పాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.
  2. 48వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో 29 పెద్ద పెద్ద గదులు, 80 డోములున్నాయి. జైన మతానికి చెందిన వ్యాపారి ధర్మా షా 15వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అనంతరం రాజ్‌పుత్‌ మహారాజు రానా కుంభాకు బహుమతిగా ఇచ్చారు.
  3. తన ఆలోచనతో ధర్మా షా మహారాజుని కలిస్తే, ఆలయానికి కావలసిన స్థలం ఇవ్వడంతో పాటు సమీపంలో టౌన్‌షిప్‌ను నిర్మించమని సలహా ఇచ్చాడు. మహారాజు సలహా మేరకు ధర్మా షా ఒకేసారి ఆలయ నిర్మాణపనులను, టౌన్‌షిప్‌ పనులను ప్రారంభించాడు. ఆ పట్టణం పేరే రణక్‌పూర్‌.
  4. యాభై ఏళ్ల పాటు జరిగిన ఆలయ నిర్మాణానికి కోటి రూపాయలు ఖర్చయిందని అంచనా. ఈ ఆలయ నిర్మాణంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడి నుంచి మూలవిరాట్టును చూసినా రాతి స్తంభాలు అడ్డుపడకుండా స్పష్టంగా కనిపిస్తుంది. 

Advertisement
Advertisement
Advertisement