ప్రేమించాలని బెదిరించిన విద్యార్థికి రెండేళ్ల జైలు శిక్ష

ABN , First Publish Date - 2022-08-11T06:04:50+05:30 IST

ప్రేమించాలని వెంటపడి బెదిరించిన విద్యార్థికి రెండు సంవత్సరాల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి

ప్రేమించాలని బెదిరించిన విద్యార్థికి రెండేళ్ల జైలు శిక్ష

రంగారెడ్డి జిల్లాకోర్టులు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ప్రేమించాలని వెంటపడి బెదిరించిన విద్యార్థికి రెండు సంవత్సరాల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి హరీష్‌ మంగళవారం తీర్పునిచ్చారు. మన్సూరాబాద్‌కు చెందిన ఇంటర్‌ విద్యార్థి ఉమాకర్‌రెడ్డి(19) తనతో చదివే బాలికను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని తరచూ బెదిరించాడు. బాలిక కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు. అనంతరం పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు. 


Updated Date - 2022-08-11T06:04:50+05:30 IST