లైంగిక దాడి కేసులో వ్యక్తికి పదేళ్ల జైలు

ABN , First Publish Date - 2021-02-25T06:52:07+05:30 IST

బాలుడిపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తూ మొదటి మెట్రోపాలిటన్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ తీర్పు చెప్పారు.

లైంగిక దాడి కేసులో వ్యక్తికి పదేళ్ల జైలు

బంజారాహిల్స్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): బాలుడిపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తూ మొదటి మెట్రోపాలిటన్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ తీర్పు చెప్పారు. ఓ బాలుడు(9) ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు.  స్కూల్‌ అయిపోగానే బాలుడు సమీపంలో ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్లేవాడు. నమాజ్‌ పూర్తి చేసుకున్నాక తల్లి వచ్చి కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేది. 2018 జూన్‌ 28న నమాజ్‌కు వెళ్లాడు. అక్కడ పనిచేసే ఇమ్రాన్‌ బాలుడిని మాటల్లో పెట్టి ప్రార్థనా మందిరం పైకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. బాలుడు విషయాన్ని తల్లికి చెప్పగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసును విచారించిన కోర్టు నిందితుడు ఇమ్రాన్‌కు ఓ సెక్షన్‌ కింద ఏడేళ్ల జైలు, రూ. 3 వేల జరిమానా, మరో కేసులో పదేళ్ల జైలు, రూ. 2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ రెండు శిక్షలు ఏక కాలంలో అమలు చేయాలని, రూ. 5 వేల జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. 


Updated Date - 2021-02-25T06:52:07+05:30 IST