Aug 6 2021 @ 01:54AM

ఓటీటీకి ‘జైభీమ్‌’ ఓటు

సూర్య హీరోగా నటిస్తూ, జ్యోతికతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘జై భీమ్‌’. నవంబర్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు గురువారం చిత్రబృందం ప్రకటించింది. దీపావళి సందర్భంగా వీక్షకుల ముందుకు తీసుకొస్తారట. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. కరోనా కారణంగా గతేడాది సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ అమెజాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. న్యాయవాదిగా సూర్య నటిస్తున్న ఈ చిత్రంలో ‘కర్ణన్‌’ ఫేమ్‌ రజిషా విజయన్‌ నాయిక.


సూర్య నిర్మిస్తున్న మరో మూడు చిత్రాలూ...

‘జైభీమ్‌’తో పాటు సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో జ్యోతికతో కలిసి నిర్మిస్తున్న మరో మూడు చిత్రాలను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీకి ఇచ్చారు సూర్య. సెప్టెంబర్‌లో ‘రామే ఆందాళూమ్‌ రావణే ఆందాళూమ్‌’, అక్టోబర్‌లో ‘ఉదాన్‌ పిరప్పే’, డిసెంబర్‌లో ‘ఓ మై డాగ్‌’ చిత్రాలు విడుదల కానున్నాయి.

Otherwoodsమరిన్ని...