రూ.కోటి ఆరోగ్య బీమాకు జై

ABN , First Publish Date - 2020-09-14T06:07:29+05:30 IST

కొవిడ్‌-19 ఒకరికి ఖేదం.. మరొకరికి మోదంగా మారింది. నిన్నమొన్నటి వరకు హెల్త్‌ (ఆరోగ్య) బీమా పాల సీ అంటే చూద్దాంలే అన్న

రూ.కోటి ఆరోగ్య బీమాకు జై

కొవిడ్‌ దెబ్బతో మారిన ఆలోచన 

 హెల్త్‌ పాలసీలకు భలే డిమాండ్‌ 

 పాలసీబజార్‌ సర్వే వెల్లడి 


న్యూఢిల్లీ: కొవిడ్‌-19 ఒకరికి ఖేదం.. మరొకరికి మోదంగా మారింది. నిన్నమొన్నటి వరకు హెల్త్‌ (ఆరోగ్య) బీమా పాల సీ అంటే చూద్దాంలే అన్న వారు.. ఇప్పుడు సమగ్ర ఆరోగ్య బీమా పాలసీల కోసం ఎగబడుతున్నారు. దీంతో గత ఏడాది జూలైతో పోల్చితే ఈ సంవత్సరం జూలై నెలలో ఆరోగ్య బీమా పాలసీల విక్రయాలు ఏకంగా 130 శాతం పెరిగినట్లు పాలసీబజార్‌ డాట్‌కామ్‌ వెల్లడించింది. అయితే ఒక్క ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలోనే పాలసీల విక్రయాలు 90 శాతం పెరిగాయని తెలిపింది.  


ఆకట్టుకునేలా పాలసీలు: కొవిడ్‌ నేపథ్యంలో రూ.కోటి ఆరోగ్య బీమా పాలసీలకు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది. మరోవైపు పలు బీమా కంపెనీలు ఇందుకోసం ఆకర్షణీయమైన ప్రీమియంతో పాలసీలను తీసుకొచ్చాయి. 32 ఏళ్ల వయసున్న వారికి ఇప్పుడు రూ.13,000 నుంచి రూ.15,000 వార్షిక ప్రీమియంతోనే రూ.కోటి కవరేజీ (సమ్‌ అష్యూర్డ్‌) ఉండే హెల్త్‌ పాలసీలను అందిస్తున్నాయి.\

ఈ ఏడాది మే వరకు పాలసీబజార్‌ ద్వారా అమ్మిన మొత్తం ఆరోగ్య బీమా పాలసీల్లో రూ.కోటి కవరేజీ ఉన్న పాలసీలు మూడు శాతం మాత్రమే. అయితే గత మూడు నెలల్లో ఈ పాలసీల వాటా 40 శాతానికి చేరిందని పాలజీబజార్‌ వెల్లడించింది.   


కనీసం రూ.10 లక్షలు: కరోనా వచ్చి ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చేరితే హాస్పిటల్‌ బిల్లు రూ.10 లక్షల పైనే అవుతోంది. దీంతో మూడు పదుల వయసులో ఉన్న వారు కూడా కనీసం రూ.10 లక్షల కవరేజీ ఉండేలా సమగ్ర ఆరోగ్య బీమా పాలసీలతో జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం 32 ఏళ్ల వయసున్న వ్యక్తులకు రూ.7,000 నుంచి రూ.9,000 వార్షిక ప్రీమియంతో రూ.10 లక్షల ఆరోగ్య బీమా పాలసీ లభిస్తోంది. 


కరోనా క్లెయిమ్స్‌ తక్కువే : ప్రస్తుతం కొవిడ్‌ ఎంత విశ్వరూపం చూపిస్తున్నా ఆరోగ్య బీమా కంపెనీలకు వచ్చే క్లెయిమ్స్‌లో దీని వాటా తక్కువే. ఈ సంవత్సరం ఏప్రిల్‌-ఆగస్టు మధ్య కాలంలో వచ్చిన హెల్త్‌ క్లెయిమ్స్‌లో 11 శాతం మాత్ర మే కొవిడ్‌ ఖర్చుల క్లెయిమ్‌లని పాలసీబజార్‌ పేర్కొంది. ఇప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలతో వచ్చే క్లెయిమ్స్‌ ఎక్కువగా ఉంటున్నాయని వెల్లడించింది. 


Updated Date - 2020-09-14T06:07:29+05:30 IST