'జై భీం' సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీతక్క

ABN , First Publish Date - 2021-11-18T01:38:39+05:30 IST

'జై భీం' సినిమాతో నటుడు సూర్య, అటు రాజకీయ ప్రముఖులతో పాటు ఇటు సామాజిక వేత్తలతో ప్రసంశలు అందుకుంటున్నారు.

'జై భీం' సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీతక్క

హైదరాబాద్‌: 'జై భీం' సినిమాతో నటుడు సూర్య, అటు రాజకీయ ప్రముఖులతో పాటు ఇటు సామాజిక వేత్తలతో ప్రసంశలు అందుకుంటున్నారు. ఉద్యమకారులు తమ జీవితాల్లో ఎదుర్కొన్న సమస్యలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 'జై భీం' సినిమా యూనిట్‌కు ఎమ్మెల్యే సీతక్క ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. జై భీమ్ సినిమాలోని ప్రతీ పాత్రను తాను నిజ జీవితంలో చూశానని తెలిపారు. సినిమాలో చూపించిన బాధలు నిజమేనని సీతక్క తెలిపారు. సీతక్కకు నటుడు సూర్య ధన్యవాదాలు తెలిపారు. 'జై భీం’ సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే అందరి మన్ననలు అందుకుంది. 




Updated Date - 2021-11-18T01:38:39+05:30 IST