‘జై ఆంధ్ర డెమోక్రటిక్‌ ఫోరం’ సదస్సు

ABN , First Publish Date - 2020-10-31T05:55:50+05:30 IST

భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలతో అధోగతి పాలవుతున్న ఏపీ పరిరక్షణకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం మేధావులు...

‘జై ఆంధ్ర డెమోక్రటిక్‌ ఫోరం’ సదస్సు

భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలతో అధోగతి పాలవుతున్న ఏపీ పరిరక్షణకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం మేధావులు, ఆలోచనాపరులు అన్వేషణ చేయవలసిన సమయం ఆసన్నమైంది. రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్ళు గడిచిపోయినా, రెండు ప్రభుత్వాలు మారినా, ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను ఒక్కటొక్కటిగా నీరు కార్చేశారు... కేంద్రంతో పోరాడి ఆంధ్రప్రదేశ్‌ హక్కులను కాపాడలేని వైసీపీ తన అశక్తతని కప్పిపుచ్చుకోవటానికి మూడు రాజధానులంటూ మూడు విషబీజాలునాటి ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపింది... ఆంధ్రప్రదేశ్‌ నేటి దుస్థితికి కారణం నీతిలేని మన రాజకీయ నాయకత్వమే. ఇప్పటికైనా యువత మేలుకోవాలి. రాజకీయాలను మార్చాలి. ఈ బృహత్‌ సాధనకై చారిత్రాత్మక ఆంధ్రమహాసభ, జై ఆంధ్ర ఉద్యమాల స్ఫూర్తితో ఆంధ్రుల ఆత్మగౌరవం, హక్కులు, అభివృద్ధి సాధనకై ‘జై ఆంధ్ర డెమోక్రటిక్‌ ఫోరం’ ఆవిర్భవిస్తున్నది. 13 జిల్లాలలో ఉద్యమ చైతన్యం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను గొప్ప సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దే మహోన్నత ఆశయం కోసం నేడు ఉదయం 10.30 గంటలకు విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో ‘జై ఆంధ్ర డెమోక్రటిక్‌ ఫోరం’ ఆవిర్భావ సదస్సు జరుగుతుంది.

అవధానుల హరి (కోఆర్డినేటర్‌)

Updated Date - 2020-10-31T05:55:50+05:30 IST