జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2022-07-07T05:13:44+05:30 IST

అణగారిన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన బాబు జగ్జీవన్‌రామ్‌ కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి కొనియాడారు.

జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం
గద్వాలలో జగ్జీవన్‌రామ్‌కు నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి 

- నివాళి అర్పించిన జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, పలువురు ప్రజాప్రతినిధులు

గద్వాల టౌన్‌, జూలై 6 : అణగారిన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన బాబు జగ్జీవన్‌రామ్‌ కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి కొనియాడారు. జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, కౌన్సిలర్లు నాగిరెడ్డి, కృష్ణ, మహేష్‌, గట్టు ఎంపీపీ విజయ్‌, ఆలూరు ఎంపీటీసీ సభ్యుడు ఆనంద్‌ గౌడ, సర్పంచ్‌ వాసు, గద్వాల పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.గోవిందు, సాయిశ్యామ్‌రెడ్డి, నాయకులు కురుమన్న, ధర్మనాయుడు, నాగులు యాదవ్‌, రామకృష్ణశెట్టి, కమ్మరిరాము, ఓం ప్రకాష్‌, భగీరథ  వంశీ, మన్యం, కృష్ణ, వీరేష్‌ పాల్గొన్నారు.


- బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్‌ నాయకత్వం నేటితరం నాయకులకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో ధరూరు రవి, ఇమ్మానియేల్‌, రమేష్‌, ప్రసాద్‌, నాగరాజు, కృష్ణ ఉన్నారు.


- బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జీఎల్‌ చందు ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి నిర్వహించారు.  ఆయన విగ్రహానికి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమానికి నాయకులు రామాంజనేయులు, బండల వెంకట్రాములు, నాగేంద్రయాదవ్‌, నెమలికంటి అంజి, మ్యాడం రామకృష్ణ, పులిపాటి వెంకటేష్‌, గోపాల్‌ రెడ్డి, వెంకటేష్‌, వీరేష్‌  హాజరయ్యారు. 


- బాబు జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని పురస్కరించుకుని నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో  బుచ్చిబాబు, బీసన్న, లక్ష్మన్న, వెంకట్రాములు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు అశోక్‌, మన్యం ఆధ్వర్యంలో  జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పరశురాం, తిమ్మోతీ, శాంతిరాజు, గణేష్‌, సుధాకర్‌, రాజు పాల్గొన్నారు. 

రాజోలి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రోగులకు మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది జయప్రకాష్‌, సరోజ, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

అయిజ : జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని పురస్కరించుకొని అయిజ ఎస్‌సీ కాలనీలోని ఆయన విగ్రహానికి టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్వీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పార్టీ మహిళా నాయకు రాలు మేరమ్మ, టీఆర్‌ఎస్వీ జిల్లా కన్వీనర్‌ పల్లయ్య, కౌన్సిలర్‌ రాణి, ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆంజనేయులు, జంగం సరిత, వేమయ్య, రవి, అయ్యన్న, రాజు, ఏనోసు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, నాయకులతో కలిసి జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.


ఇటిక్యాల : డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రాం వర్దంతిని పురస్కరించుకొని పుటాన్‌దొడ్డి యువజన సంఘం నాయకులు కోదండాపూర్‌ స్టేజీ వద్ద నున్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మందా జగన్నాథ్‌, శివన్న, రవి, మద్దలేటి, సత్యం, ప్రేమ్‌సాయి, బీసన్న, మధు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T05:13:44+05:30 IST