జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-07-07T05:14:29+05:30 IST

భారత మాజీ ప్రధాని బాబూజగ్జీవన్‌రామ్‌ 36 వర్థంతి కార్యక్రమం ఏలూరు 18వ డివిజన్‌ బాప్టిస్ట్‌ పేటలో టీడీపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి పాళి ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి
చింతలపూడిలో జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద టీడీపీ నాయకుల నివాళి

టీడీపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్‌


ఏలూరు టూటౌన్‌, జూలై 6 : భారత మాజీ ప్రధాని బాబూజగ్జీవన్‌రామ్‌ 36 వర్థంతి కార్యక్రమం ఏలూరు 18వ డివిజన్‌ బాప్టిస్ట్‌  పేటలో టీడీపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి పాళి ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. జగ్జీవన్‌రామ్‌, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇనుపనూరి జగదీష్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు. దళిత సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రవిప్రకాష్‌ తదితరులు జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించారు. జగ్జీవన్‌రామ్‌ యూత్‌ ఆధ్వర్యంలో తూర్పువీధిలో జగ్జీవన్‌రామ్‌ వర్థంతి కార్య క్రమం దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జిజ్జువరపు ప్రతాప్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

టి.నరసాపురం : కె.జగ్గవరంలో జగ్జీవన్‌రామ్‌ సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ వారి ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడు తనగాల వీరవెంకయ్య, బొడ్డపాటి రాంబాబు, నాగేశ్వరరావు, కార్యదర్శి పరసా రాజ్‌కుమార్‌ తదితరులు జగ్జీవన్‌రామ్‌కు నివాళులర్పించారు.
గణపవరం : జగ్జీవన్‌రామ్‌ దళిత, బహుజనుల సంక్షేమం కోసం విశేష సేవలందించారని టీడీపీ మండల అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణం రాజు, ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ యువత అధ్యక్షుడు అద్దేపల్లి వాసురాజు అన్నారు. బుధవారం పిప్పర టీడీపీ కార్యాలయంలో జగ్జీవన్‌రామ్‌ వర్థంతిని నిర్వహించారు. టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి యాళ్ళ సుబ్బారా వు, జల్లికాకినాడ టీడీపీ అధ్యక్షుడు దండు బాబ్జీరాజు, మాజీ ఎంపీటీసీ దాయిని వరప్రసాద్‌, మాజీ సర్పంచ్‌ కొప్పిశెట్టి ఏసుబాబు పాల్గొన్నారు.
కామవరపుకోట : తాడిచర్ల గ్రామంలో జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని టీడీపీ నాయకులు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, టీడీపీ మండల కిలారు సత్యనారాయణ, నవ్యాంధ్ర రాష్ట్ర నాయకుడు మాముడూరి మహంకాళి, మాజీ జడ్పీటీసీ ఘంటా సుధీర్‌బాబు, తాడిచర్ల సర్పంచ్‌ పసుమర్తి పార్ధసారధిబాబు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. వీరిశెట్టిగూ డెంలో ఎమ్మార్పీఎస్‌ మండల కార్యదర్శి భారతాల రమేష్‌ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
చింతలపూడి : పట్టణ తెలుగుదేశం ఆధ్వర్యంలో స్థానిక ఫైర్‌స్టేషన్‌లో జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పట్టణశాఖ అధ్యక్షుడు పక్కాల వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు నంది పాం నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు సొంగా ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం టౌన్‌ : శ్రీనివాసపురంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి కార్యక్రమాలను జగ్జీవన్‌రామ్‌ సంఘ అధ్యక్షుడు జొన్నకూటి శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీస్‌ జిల్లా అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్‌ మాట్లాడారు. సంఘం నాయకులు తానిగడప నాగార్జున, తాళూరి రామకృష్ణ, తడికల మంగారావు తదితరులు పాల్గొన్నారు.
ఉంగుటూరు : ఉంగుటూరు, నారాయణపురంలలో బుధవారం ఎస్సీ కాలనీలలో ఏర్పాటు చేసిన బాబూజగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ ఉంగుటూరు మండల ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ నేకూరి ఆశీర్వాదం, పార్టీ మండల అధ్యక్షుడు పాతూరి విజయకుమార్‌, పుట్టా కుమార్‌, నారాయణపురం సర్పంచ్‌ దిడ్ల అలకనంద శ్రీనివాస్‌, ఇర్లపాటి మోషే, ఉండ్రాజవరపు దుర్గారావు, బండారు మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:14:29+05:30 IST