జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు పాటుపడాలి

ABN , First Publish Date - 2022-05-23T06:34:08+05:30 IST

బాబు జగజ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌బాబు సూచించారు.

జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు పాటుపడాలి

అంబాజీపేట, మే 22: బాబు జగజ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌బాబు సూచించారు. అంబాజీపేట బస్టాండ్‌ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని ఆదివారం రాత్రి ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మార్పీఎస్‌ నాయకుడు బొమ్మి ఇజ్రాయిల్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ అంబేడ్కర్‌, జగ్జీవన్‌రామ్‌లు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా కృషిచేశారన్నారు. కోనసీమకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు ప్రభుత్వం ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. తొలుత ముక్కామల నుంచి ఎమ్మార్పీఎస్‌ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.  ఎంపీ చింతా అనురాధ,  ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, జడ్పీటీసీ బూడిద వరలక్ష్మి పాల్గొన్నారు.




Updated Date - 2022-05-23T06:34:08+05:30 IST