నేటితరం నాయకులకు జగ్జీవన్‌రామ్‌ ఆదర్శం

ABN , First Publish Date - 2022-07-07T05:00:39+05:30 IST

అట్టడుగు వర్గాల నుంచి ఉపప్రధాని స్థాయికి ఎది గిన బూబు జగ్జీవన్‌రామ్‌ నాయకత్వం నేటితరం నాయకులకు ఆదర్శమని టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్య క్షుడు, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌ అన్నారు.

నేటితరం నాయకులకు జగ్జీవన్‌రామ్‌ ఆదర్శం
వనపర్తిలో జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

 - టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌

- ఘనంగా మాజీ ఉపప్రధాని వర్ధంతి

వనపర్తి అర్బన్‌/ వనపర్తి టౌన్‌, జూలై 6:  అట్టడుగు వర్గాల నుంచి ఉపప్రధాని స్థాయికి ఎది గిన బూబు జగ్జీవన్‌రామ్‌ నాయకత్వం నేటితరం నాయకులకు ఆదర్శమని  టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్య క్షుడు, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌ అన్నారు.  బాబు జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి సందర్భంగా  బుధవారం పట్టణంలోని పలుస రమేష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో  దివంగత నేత చిత్రపటానికి  పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గట్టు యాదవ్‌ మాట్లాడుతూ అణగారిన వర్గాల సంక్షేమం కోసం అహర్షిశ్నలు శ్రమించిన బాబు జగ్జీవన్‌రామ్‌ దేశానికి చేసిన  సేవలు చిరస్మర ణీయమన్నారు.   కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, నాయకులు పెండెం కురు మూర్తి యాదవ్‌, పుట్టపాకుల మహేష్‌, నందిమల్ల శ్యామ్‌, గంధం పరంజ్యోతి, ఉంగ్లం తిరుమల్‌, ఆవుల రమేష్‌, ఎత్తం రవికుమార్‌, సూర్యవంశం గిరి  పాల్గొన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని పాలి టెక్నిక్‌ కళాశాల మైదానంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్‌  వర్ధంతిని టీజే ఏసీ నాయకులు జరుపుకున్నారు. జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రజా వాగ్గేయ కారుడు రాజారాం ప్రకాష్‌ మాట్లాడుతూ  కుల, మత రహిత సమాజం కోసం బాబు జగ్జీవన్‌రామ్‌ ఎనలేని కృషి చేశారని,  భారతరత్న అవార్డు ఇవ్వాలని అయన ప్రభుత్వాన్ని కోరారు.  కార్య క్రమంలో టీజేఏసీ నాయకులు గిరిరాజాచారి, నా యికంటి నరసింహా శర్మ, తగవుల వెంకటస్వామి, కోనింటి వెంకటేశ్వర్లు, కొమ్ము బాలస్వామి   పాల్గొన్నారు. 

- కొత్తకోట : పట్టణంలో బాబు జగ్జీవన్‌ రామ్‌ వర్థంతిని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బుధ వారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా  దేశానికి ఆయన చేసిన సేవలను నాయకులు కొనియా డారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ వామన్‌ గౌడ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సుకేశిని, వైస్‌ చైర్‌ప ర్సన్‌ జయమ్మ, నాయకులు విశ్వేశ్వర్‌, ప్రశాంత్‌, కృష్ణారెడ్డి, మిషేక్‌, యాదగిరి యాదవ్‌, పండ్లబండి రాములు యాదవ్‌, ఖాజామైనొద్దీన్‌, తిరుపతి, నాగన్న సాగర్‌, ఆద్వానిశ్రీను, రవీందర్‌రెడ్డి, సు భాష్‌, పెంటన్న యాదవ్‌, వెంకటన్నగౌడ్‌, ప్రేమ దానం, శ్రీనివాస్‌జీ, మన్నెం యాదవ్‌, వహీద్‌అలీ, సయ్యద్‌ లాలు, నరేష్‌గౌడ్‌  పాల్గొన్నారు. 

- వీపనగండ్ల: స్వాతంత్య్ర సమరయోధుడు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని బుధవారం మండల కేంద్రంలో  తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము  పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.    కార్యక్రమంలో తెలంగాణ యువసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు, తెలంగాణ దండోరా మండల నాయకులు శివ, శివకుమార్‌, స్టూడెంట్‌ ఆర్గనైజేష న్‌ మండలాధ్యక్షుడు రామకృష్ణ, రాఘవేంద్ర, గం గోలి, ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T05:00:39+05:30 IST