అల్లుడ్ని హత్య చేసేందుకు వచ్చిన మామ...అల్లుడు పరారవడంతో..
ABN , First Publish Date - 2021-12-14T01:06:05+05:30 IST
నగరంలోని బీట్ బజార్‌లో దారుణం జరిగింది. అల్లుడ్ని హత్య చేసేందుకు కత్తితో వచ్చిన మామ... అల్లుడు పరారవటంతో అతని తల్లి యమునను పొడిచిన నిందితుడు మహేష్ పరారయ్యాడు.
జగిత్యాల: నగరంలోని బీట్ బజార్‌లో దారుణం జరిగింది. అల్లుడ్ని హత్య చేసేందుకు కత్తితో వచ్చిన మామ... అల్లుడు పరారవటంతో అతని తల్లి యమునను పొడిచిన నిందితుడు మహేష్ పరారయ్యాడు. వెంటనే స్థానికులు యమునను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తన కూతురును చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అల్లుడు కిరణ్‌ను హత్య చేసేందుకు మామ మహేష్ ప్రయత్నించాడు. ఘటన స్థలంలో మహేష్‌ను పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు.