జగిత్యాల: జగిత్యాలలో అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. మిషన్ చబుత్ర పేరుతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న 67 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 13 మందిపై డ్రంక్ డ్రైవ్, 23 మందిపై న్యూసెన్స్ కేసులను నమోదు చేశారు.