మల్యాల పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ నేతల ధర్నా

ABN , First Publish Date - 2022-04-19T16:07:39+05:30 IST

జిల్లాలోని మల్యాల పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు.

మల్యాల పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ నేతల ధర్నా

జగిత్యాల: జిల్లాలోని మల్యాల పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. కొండగట్టు ధర్మపోరాట పాదయాత్ర సందర్భంగా డీజే తీసుకువచ్చిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో యువకుడిని విడుదల చేయాలని కాంగ్రెస్ ఇంచార్జ్ సత్యం, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇటీవల జరిగిన పాదయాత్రలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్న విషయం తెలిసిందే. రాజకీయ కక్షలో భాగంగా యువకుడిని అరెస్ట్‌ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

Updated Date - 2022-04-19T16:07:39+05:30 IST