గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్సులో జగిత్యాల వాసికి చోటు

ABN , First Publish Date - 2022-05-29T09:29:05+05:30 IST

జగిత్యాల జిల్లా కేంద్రంలోని తులసీనగర్‌కు చెందిన డాక్టర్‌ గుర్రం దయాకర్‌ అనే సూక్ష్మ కళాకారుడు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్సులో జగిత్యాల వాసికి చోటు

సూక్ష్మ ఎలుకల బోను తయారు చేసిన గుర్రం దయాకర్‌ 

జగిత్యాల టౌన్‌, మే 28: జగిత్యాల జిల్లా కేంద్రంలోని తులసీనగర్‌కు చెందిన డాక్టర్‌ గుర్రం దయాకర్‌ అనే సూక్ష్మ కళాకారుడు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. చిన్న చెక్కపై వైరుతో పనిచేసే ఎలుకల బోనును కేవలం 29 నిమిషాల వ్యవధి లో 5మి.మీ పొడవు, 2.5 మి.మీ వెడల్పుతో ఆయన తయారు చేశారు. గతంలో ఆంధ్రపదేశ్‌కు చెందిన వ్యక్తి 8 మి.మీ పొడవు, 5 మి.మీ వెడల్పుతో ఎలుకల బోను తయారు చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నెలకొల్పగా దయాకర్‌ దాన్ని బ్రేక్‌ చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే దయాకర్‌ అతి సూక్ష్మ కళాఖండాలు తయారు చేస్తూ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సుతోపాటు అబ్దుల్‌ కలాం బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానం పొందారు. 

Updated Date - 2022-05-29T09:29:05+05:30 IST