Abn logo
Jun 17 2021 @ 00:58AM

అవినీతికి అడ్డాగా జగిత్యాల మున్సిపల్‌ కార్యాలయం

మాట్లాడుతున్న రవీందర్‌రెడ్డి

- బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముదుగంటి రవీందర్‌రెడ్డి 

జగిత్యాల అర్బన్‌, జూన్‌ 16: జగిత్యాల మున్సిపల్‌ కా ర్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముదుగంటి రవీందర్‌రెడ్డి  విమర్శించారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రలోని బీజేపీ   కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. అవినీతిని అరికట్టడంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణిలు విఫలం అయ్యారని విమర్శించారు. అవినీతికి అడ్డాగా జగిత్యాల మున్సిపల్‌ కార్యాలయం మారిందన్నారు. మున్సిపల్‌ కా ర్యాలయంలో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చే ప్రయ త్నం ఛైర్‌పర్సన్‌, పాలకవర్గం చేస్తున్నారని దుయ్యబట్టారు. మున్సిపల్‌ పరిధిలో జరుగుతున్న సుందరీకరణ పనుల్లో భాగంగా ధరూర్‌ వాగు నుంచి మంచినీళ్ల బావి వరకు చేపట్టిన డివైడర్‌ పనులు నాసిరకంగా ఉన్నాయన్నారు. గ్రానైట్‌ రాయితో నిర్మాణం చేపట్టకుండా, నాసి రకం రంగులు వేసి చేతులు దులుపుకున్నారన్నారు. డివైడర్ల మధ్యలో ఎర్రమట్టి పోయకుండా మొరం పోస్తున్నా రన్నారు. కోరుట్ల, మెట్‌పెల్లి మున్సిపాలిటీలో జరిగిన డివైడర్ల అత్యంత నాణ్యతమైన పనులు చేపడితే జగిత్యాలలో మాత్రం అందుకు భిన్నంగా జరిగిన నాసిరకం పనులపై ఎమ్మెల్యే  డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, ఛైర్‌పర్సన్‌ శ్రావణిలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

అలాగే హరితహారంలో నాటిన మొక్కల వివరాలు, నాటేందుకు అయిన ఖర్చులు బహిర్గతం చేయాలని రవీందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. డివైడర్ల నిర్మాణాలపై వస్తున్న ఆరోపణలపై నిగ్గుతేల్చి, వాస్తవాలను ప్రజలకు తెలుపాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు ఏసీఎస్‌ రాజు, భగవంతరావు, చీటి శేఖర్‌ రావు, ఆముద రాజు, ఠాకూర్‌ కిషోర్‌ సింగ్‌, భిక్షపతి, గట్టెపెల్లి జ్ఞానేశ్వర్‌, జిట్టవేణి అరుణ్‌, గాజోజు సంతోష్‌, కూర్మాచలం సతీష్‌, బిట్టు, లింగంపేట నరేష్‌, ప్రమోద్‌, రమేష్‌ తదితరులు ఉన్నారు.