జగిత్యాల జిల్లాలో రైతులకు కొత్త సమస్యలు

ABN , First Publish Date - 2022-01-16T16:21:16+05:30 IST

జగిత్యాల: జిల్లాలో రైతులకు కొత్త సమస్యలొచ్చాయి. వరి స్థానంలో ఆరుతడి పంటలు వేసినా కష్టాలు తప్పడంలేదు.

జగిత్యాల జిల్లాలో రైతులకు కొత్త సమస్యలు

జగిత్యాల: జిల్లాలో రైతులకు కొత్త సమస్యలొచ్చాయి. వరి స్థానంలో ఆరుతడి పంటలు వేసినా కష్టాలు తప్పడంలేదు. అటవీ ప్రాంతంలో ఉన్న కోతులు, అడవి పందుల బెడదకు పంటలన్నీ నాశనమవుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా రైతులు పంటల వద్ద కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


వేసిన పంటలను కోతులు, అడవి పందులు నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులు, అడవి పందుల సమస్య నుంచి ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరితో ప్రత్యామ్నాయం పంటలు వేస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. కొత్త సమస్యలతో సతమతమవుతున్నారు.

Updated Date - 2022-01-16T16:21:16+05:30 IST