Oct 20 2021 @ 03:51AM

బాలీవుడ్‌కు జగ్గూభాయ్‌

ఏ తరహా పాత్రలోనయినా ఇమిడిపోతూ తనలోని నటుణ్ణి తెరపై కొత్తగా ఆవిష్కస్తున్నారు జగపతిబాబు. దక్షిణాదిన డిమాండ్‌ ఉన్న నటుడిగా కొనసాగుతుండడంతో హిందీ సినిమాల్లో కూడా నటించమంటూ ఆహ్వానం అందినా ఆయనకు ఇప్పటిదాకా కుదరలేదు. అయితే హిందీ చిత్రసీమకు త్వరలోనే జగపతిబాబు ఎంట్రీ ఖాయం అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఫర్హాన్‌ అక్తర్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో జగపతిబాబు మెయిన్‌ విలన్‌ రోల్‌ పోషించనున్నారట. ఈ సినిమాకు ‘పుకార్‌’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయిక. అశుతోష్‌ గోవరికర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జావేద్‌ అక్తర్‌ కథ, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.