Advertisement
Advertisement
Abn logo
Advertisement

బెల్లం పానకం మంచిదే!

ఆంధ్రజ్యోతి(10-02-2021)

వెచ్చని బెల్లం పానకం తాగితే బరువు తగ్గడమే కాదు మరెన్నో లాభాలు ఉన్నాయంటన్నాయి అధ్యయనాలు. అయితే  బెల్లంలోని తీపి గుణం అందరికీ పడదు కాబట్టి   వైద్యుని సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. 


ఉదయం పూట గోరువెచ్చని బెల్లంపానకం తాగడం వల్ల విసర్జన హాయిగా అవుతుంది.

కడుపులోని విషపదార్థాలు బయటకు పోయి జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

బెల్లం శరీర ఉష్ణోగ్రతను స్థిరీకరిస్తుంది. అందుకే చలికాలంలో బెల్లం తినమంటారు.

మలబద్ధకం, ఎసిడిటీ సమస్యలను బెల్లం నివారిస్తుంది. 

బెల్లంలో ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-సి పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

బెల్లంలోని ఖనిజాలు, విటమిన్లు సీజనల్‌గా వచ్చే ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయి.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...