జగ్గయ్యపేట మున్సిపల్ వైస్‌చైర్మన్ వీరంగం

ABN , First Publish Date - 2022-04-30T23:40:34+05:30 IST

మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైస్‌చైర్మన్

జగ్గయ్యపేట మున్సిపల్ వైస్‌చైర్మన్ వీరంగం

జగ్గయ్యపేట: మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైస్‌చైర్మన్ ప్రభాకర్ దురుసుగా ప్రవర్తించాడు. టౌన్ ప్లానింగ్ అధికారి మూర్తిపై దుర్భాషలాడుతూ దాడికి యత్నించాడు. అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేస్తే తననే ఇరికిస్తావా అంటూ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైస్‌చైర్మన్‌ను కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు  అడ్డుకున్నారు. టీపీఎస్‌ను బదిలీ చేసేంతవరకు కౌన్సిల్‌ మీటింగ్‌కు రానంటూ శపథం చేసి వైస్ చైర్మన్ వాకౌట్ చేశారు. కౌన్సిల్లో అలా మాట్లాడకూడదన్నందుకు చైర్మన్ రాఘవేంద్రపైన ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. టీపీఎస్‌కు మద్దతిస్తారా అంటూ ఆగ్రహంగా ఆయన బయటికెళ్ళి పోయారు. ఫర్వాలేదులే అంటూ చైర్మన్ రాఘవేంద్ర ముక్తాయింపు ఇచ్చారు. వైస్‌చైర్మన్ తీరుపై మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-04-30T23:40:34+05:30 IST