modi, kcr పర్యటనలపై అనుమానాలున్నాయి: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-05-27T20:22:25+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్ పర్యటనలపై అనుమానాలున్నాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

modi, kcr పర్యటనలపై అనుమానాలున్నాయి: జగ్గారెడ్డి

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్ పర్యటనలపై అనుమానాలున్నాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్ర సమస్యలు అడిగే బాధ్యత సీఎంకు లేదా? అని ప్రశ్నించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజల ముందే ప్రధానిని నిలదీశారని చెప్పారు. కేసీఆర్ ఆ పని ఎందుకు చేయలేదు?అని ప్రశ్నించారు. కేసీఆర్, మోదీ మధ్య పొలిటికల్ అండర్ స్టాండింగ్ ఉందన్నారు.మత విద్వేశాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. ప్రధాని మోదీ రావడం, కేసీఆర్ వెళ్లడమంటే ఇద్దరి అవగాహనలో భాగమేనని చెప్పారు..



కేసీఆర్, మోదీ మధ్య పొలిటికల్ అండర్ స్టాండింగ్ ఉందన్నారు.  బీజేపీ, టీఆర్ఎస్ తిట్ల పురాణం ఒక నాటకమని దెప్పిపొడిశారు.మోదీ ప్రజా సమస్యల మీద ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.పదిహేను లక్షలు పేదవారి ఖాతాలో వేస్తామన్న హామీపై ఎందుకు మాట్లాడలేదన్నారు.బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉద్యోగాల భర్తీ పై మోదీని ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు.బండి సంజయ్ ఎప్పుడైనా గుడికి వెళ్తారని.. కానీ మసీదులు తవ్వుతామని ప్రకటించడం ఏం రాజకీయమని ధ్వజమెత్తారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఏం రాజకీయమన్నారు.అందరూ బాగుండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు.ప్రధాని మోదీ రాష్ట్ర సీఎంను తిడితే ప్రజల కడుపు నిండుతుందా అని నిలదీశారు.కేసీఆర్ చెప్పిన ఏ ఒక్క హామీ నెరవేరలేదన్నారు.కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా తిరగడం లేదని చెప్పారు.ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.రాజకీయ విమర్శలు మాని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని  జగ్గారెడ్డి కోరారు.

Updated Date - 2022-05-27T20:22:25+05:30 IST