స్వరాష్ట్రంలో విద్యార్థులకు స్వేచ్ఛ లేదు: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-12-23T20:07:56+05:30 IST

స్వరాష్ట్రంలో విద్యార్థులకు స్వేచ్ఛ లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.

స్వరాష్ట్రంలో విద్యార్థులకు స్వేచ్ఛ లేదు: జగ్గారెడ్డి

హైదరాబాద్: స్వరాష్ట్రంలో విద్యార్థులకు స్వేచ్ఛ లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని గురువారం  ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దీక్ష చేపట్టారు. ఈసంద్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం పేద విద్యార్థుల సమస్యలు ఆలోచించక పోవడం సిగ్గుచేటన్నారు. అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులను పాస్ చేశారన్నారు. తెలంగాణలో విద్యార్థలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఈ రోజు శాంతియుతంగా దీక్ష చేశానని చెప్పారు. ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులను పాస్ చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 25లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేపటి వరకు ప్రభుత్వం స్పందించక పోతే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు చనిపోతుంటే మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజభోగాలు అనుభవిస్తోందని జగ్గారెడ్డి అన్నారు.

Updated Date - 2021-12-23T20:07:56+05:30 IST