అమిత్ షా డైరెక్షన్‌లోనే సీఎం మార్పు: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-01-21T18:40:37+05:30 IST

హైదరాబాద్: సీఎం మార్పు వార్తలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. బీజేపీ డైరెక్షన్‌లోనే కేసీఆర్ దిగిపోయి

అమిత్ షా డైరెక్షన్‌లోనే సీఎం మార్పు: జగ్గారెడ్డి

హైదరాబాద్: సీఎం మార్పు వార్తలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పందించారు. నేడు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ డైరెక్షన్‌లోనే కేసీఆర్ దిగిపోయి కేటీఆర్‌ను సీఎంను చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. అమిత్ షా డైరెక్షన్‌లోనే ఇది జరుగుతోందన్నారు. దీని వెనుక పెద్దన్న బీజేపీ, చిన్నన్న ఎంఐఎం ఉందన్నారు. కేటీఆర్‌తో తనకు ఇప్పటి వరకు ఏ పంచాయితీ లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.


Updated Date - 2021-01-21T18:40:37+05:30 IST