దేశమంతా రెమిడిసివిర్ బ్లాక్ దందా జరిగింది: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-05-23T19:22:29+05:30 IST

దేశమంతా రెమిడిసివిర్ బ్లాక్ దందా జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. హెటిరో పార్థసారథి ఆఫీస్‌లో ఐటీ రూ.500 కోట్లు పట్టుకుందన్నారు.

దేశమంతా రెమిడిసివిర్ బ్లాక్ దందా జరిగింది: జగ్గారెడ్డి

హైదరాబాద్ : దేశమంతా రెమిడిసివిర్ బ్లాక్ దందా జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. హెటిరో పార్థసారథి ఆఫీస్‌లో ఐటీ రూ.500 కోట్లు పట్టుకుందన్నారు. ఈ కేసు ఏమైందో ఇంతవరకు చెప్పడం లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. రెమిడిసివిర్‌ దందాలో రూ.10వేల కోట్ల స్కామ్ జరిగిందన్నారు. ఒక్కో ఇంజెక్షన్ రూ.లక్ష వరకు హెటిరో విక్రయించిందన్నారు. ఇంకా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇంత పెద్ద స్కామ్ చేసిన పార్థసారథి రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారు. రెమిడిసివిర్‌కు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? 4 నెలల తర్వాత ప్రాణానికి నష్టమని ఎందుకు చెప్పారు? ఫార్మా మాఫియా విచ్చలవిడి తనానికి ఇదొక ఉదాహరణ. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వ్యక్తికి రాజ్యసభ టికెట్ ఇస్తారా? పార్థసారథికి రాజ్యసభ టికెట్ రావడంలో బీజేపీ హస్తం ఉంది. పార్థసారథిపై ఎన్నికల కమిషన్‌, సీబీఐకి లేఖ రాస్తా’’ అని పేర్కొన్నారు.


Updated Date - 2022-05-23T19:22:29+05:30 IST