జగ్గారెడ్డి పార్టీ విడిచి వెళ్ళడని భావిస్తున్నాం: భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2022-02-24T23:30:49+05:30 IST

ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ విడిచి వెళ్ళడని భావిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఆయన మీడియాతో

జగ్గారెడ్డి పార్టీ విడిచి వెళ్ళడని భావిస్తున్నాం: భట్టి విక్రమార్క

హైదరాబాద్: ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ విడిచి వెళ్ళడని భావిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డికి కొన్ని ఇబ్బందులున్నాయని, తమ దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. జగ్గారెడ్డి రాజీనామా చేయకుండా సముదాయించామని, ఆయన లేవనెత్తిన అంశాలపై అధిష్టానంతో మాట్లాడుతామని భట్టి తెలిపారు. 


జగ్గారెడ్డిని పార్టీ వీడొద్దని చెప్పామని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. జగ్గారెడ్డి తమతో అనేక విషయాలు చెప్పారని, వాటిని అధిష్టానం ముందు పెడతామని చెప్పారు. జగ్గారెడ్డి వ్యవహారం మాణిక్కం ఠాగూర్‌కు పీసీసీ నేతలు చేరవేస్తున్నారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Updated Date - 2022-02-24T23:30:49+05:30 IST