రాజమండ్రి: అంబాజీపేట మండలం జగ్గనతోట ప్రభల తీర్ధం ఊరేగింపులో ఘర్షణ చోటు చేసుకుంది. అమలాపురం టౌన్ ఎస్ఐ పరదేసికు తీవ్ర గాయాలయ్యాయి. అయినవిల్లి మండలం నెదునూరులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలూ రాళ్లు రువ్వుకున్నాయి. జగ్గనతోట ప్రభల తీర్ధం నుంచి నెదునూరు ప్రభ తిరిగి వెళ్తున్న సమయంలో రెండు వర్గల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.