జగ్గంపేట ఎస్‌ఐ లక్ష్మీకాంతం వీఆర్‌లోకి..

ABN , First Publish Date - 2022-01-28T07:31:32+05:30 IST

జగ్గంపేట ఎస్‌ఐ లక్ష్మీకాంతంపై వేటు పడింది. ఆమెను వీఆర్‌లోకి పంపిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఆమెపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వ్యవహార శైలిపైనా పలు ఫిర్యాదులు అందాయి.

జగ్గంపేట ఎస్‌ఐ లక్ష్మీకాంతం వీఆర్‌లోకి..

పెద్దాపురం/జగ్గంపేట, జనవరి 27: జగ్గంపేట ఎస్‌ఐ లక్ష్మీకాంతంపై వేటు పడింది. ఆమెను వీఆర్‌లోకి పంపిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఆమెపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వ్యవహార శైలిపైనా పలు ఫిర్యాదులు అందాయి. ఈనెల 26న పెద్దాపురం పట్టణ పరిధిలోని రామేశంమెట్ట నుంచి గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తూ ఎని మిది లారీలు పట్టుబడ్డ వ్యవహారంలో ఆమె భర్త ప్రధాన పాత్ర ఉండటం, ట్రిప్‌ షీట్లలో ఆమె భర్త పేరు రాసి ఉండడంతో ఎస్పీతోపాటు డీఐజీ సీరియస్‌ అయినట్టు తెలిసింది. ఈమేరకు మంగళవారం విచారణ కూడా చేశారు. అనంతరం గురువారం ఆమెను వీఆర్‌లోకి పంపించా రు. ఈ విషయాన్ని పెద్దాపురం డీఎస్పీ కార్యాలయ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి. 

Updated Date - 2022-01-28T07:31:32+05:30 IST