జగ్గయ్యపేటలో ఉద్రిక్తత : నెట్టెం, తాతయ్యల అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-10-21T06:47:26+05:30 IST

జగ్గయ్యపేటలో ఉద్రిక్తత : నెట్టెం, తాతయ్యల అరెస్ట్‌

జగ్గయ్యపేటలో ఉద్రిక్తత : నెట్టెం, తాతయ్యల అరెస్ట్‌

జగ్గయ్యపేట : జగ్గయ్యపేటలో బుధవారం బంద్‌ను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు ఉదయమే టీడీపీ జాతీయ కోశాధికారి, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఇంటికి చేరుకోగా, జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పస్సైలు చినబాబు, రామారావు, సిబ్బందితో తాతయ్య ఇంటికి చేరుకుని బంద్‌కు అనుమతి లేదని, పాల్గొనవద్దని కోరారు. తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని ఆయన బదులిచ్చారు. టీడీపీ విజయవాడ పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌ అక్కడకు చేరుకున్నారు. తాతయ్యను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు వాహనాలు అడ్డుపెట్టినా కుదరలేదు. దీంతో ముక్త్యాల రోడ్డు జంక్షన్‌ వద్ద పోలీసులు వారిద్దరినీ బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నిం చారు. టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరాం చినబాబు, నెట్టెం శివరామ్‌, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ శ్రీరాం సుబ్బారావు, టీడీపీ మాజీ ఫ్లోర్‌లీడర్‌ యలమంచిలి రాఘవ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మేకా వెంకటేశ్వర్లు, తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు కన్నెబోయిన రామలక్ష్మి, గింజుపల్లి రమేశ్‌, మాజీ కౌన్సిలర్లు, పార్టీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. 



Updated Date - 2021-10-21T06:47:26+05:30 IST