డీఈఓ ఆఫీస్‌ నుంచి జగదీష్‌ అవుట్‌ !

ABN , First Publish Date - 2022-07-01T06:00:02+05:30 IST

వివాదాస్పద, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపరింటెండెంట్‌ జగదీష్‌ ను ఎట్టకేలకు అనంతపురం డీఈఓ ఆఫీస్‌ నుంచి ఎస్‌ఎ్‌సఏకు సాగనంపారు.

డీఈఓ ఆఫీస్‌ నుంచి జగదీష్‌ అవుట్‌ !


పలువురు సూపరింటెండెంట్లకు స్థాన చలనం 

 అనంతపురం విద్య, జూన్‌ 30: వివాదాస్పద, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సూపరింటెండెంట్‌ జగదీష్‌ ను ఎట్టకేలకు అనంతపురం డీఈఓ ఆఫీస్‌ నుంచి ఎస్‌ఎ్‌సఏకు సాగనంపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ వెంకట క్రిష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల సాధారణ బదిలీల్లో పలువురు అధికారులకు స్థాన చలనం కలిగింది. అనంతపురం డీఈఓ ఆఫీ్‌సలో ఉన్న సూపరింటెండెంట్‌ పురుషోత్తం ప్రసాద్‌ను శ్రీసత్యసాయి జిల్లాకు, అక్కడున్న శ్రీనాథ్‌ను అనంతపురం జిల్లా డీఈఓ ఆఫీ్‌సకు బదిలీ చేశారు. అనంతపురం సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఉన్న లక్ష్మీనారాయణను కర్నూలు జిల్లా సమగ్రశిక్ష ప్రాజెక్టుకు అక్కడున్న ఫ్రాంక్లిన్‌ను అనంతపురం జిల్లా సమగ్రశిక్షకు, డీఈఓ ఆఫీ్‌సలో ఉన్న జగదీ్‌షను సమగ్రశిక్షకు వేయగా, అక్కడున్న సరళను డీఈఓ ఆఫీ్‌సకు బదిలీ చేశారు.  సాధారణ బదిలీల్లో ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, మరో  18 మంది జూనియర్‌ అసిస్టెంట్లు, 18మంది రికార్డు అసిస్టెంట్లు, 6 మంది రికార్డ్‌ అస్టింట్లు, ముగ్గురు టైపిస్టులను బదిలీ చేశారు. 


ఏసీగా గోవింద్‌ నాయక్‌..!

అనంతపురం జిల్లా ప్రభుత్వ పరీక్షల విభాగం ఏసీగా గోవింద్‌ నాయక్‌ నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ఏసీ శ్రీనివాసరావును విజయవాడలోని ప్రభుత్వ పరీక్షల విభాగం ఆఫీ్‌సకు బదిలీ చేశారు. అక్కడున్న గోవింద్‌ నాయక్‌ను జిల్లాకు బదిలీ చేశారు. ఆయన గతంలో కూడా జిల్లాలో పనిచేశారు


Updated Date - 2022-07-01T06:00:02+05:30 IST