Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 19 Oct 2021 20:36:12 IST

Jagapathi Babu కు మొట్టమొదటి బాలీవుడ్ ఆఫర్.. పవర్‌ఫుల్ విలన్‌గా ఛాన్స్.. హీరో ఎవరంటే..

twitter-iconwatsapp-iconfb-icon

జగపతి బాబు బాలీవుడ్ ఎంట్రీకి అంతా సిద్ధమైపోయింది! టాలీవుడ్‌లో విలన్‌గా మారాక ఫుల్ బిజీ అయిన టాలెంటెడ్ యాక్టర్ నెక్ట్స్ స్టెప్ హిందీ తెర మీదకి వేయబోతున్నాడు. మరో విశేషం ఏంటంటే, జగపతి బాబు నెగటివ్ రోల్‌లో కనిపించబోయే భారీ బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ అలరించనుంది. ఇక హీరోగా మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఫర్హాన్ అఖ్తర్ కనిపించనున్నాడు. ఆయన పాత్ర ఒక ఫారెస్ట్ ఆఫీసర్‌గా తెర మీద పోరాడనుందట.

 

ఎప్పుడూ పీరియాడికల్ చిత్రాలతో ఆకట్టుకునే దర్శకుడు అశుతోశ్ గోవారికర్ ఈ సారి ఫర్హాన్, రకుల్ జంటగా యాక్షన్ థ్రిల్లర్ ట్రై చేస్తున్నాడు. ‘పుకార్’ పేరుతో ఆయన రూపొందించబోయే సినిమాకి 15 ఏళ్ల గ్యాప్ తరువాత జావేద్ అఖ్తర్ కథ అందిస్తుండటం మరో విశేషం. భారీ బడ్జెట్‌తో ఫర్హాన్ అఖ్తర్ హోమ్ బ్యానర్‌ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందనున్న ‘పుకార్’ మూవీ జగపతి బాబుకి బాలీవుడ్‌లో ఎలాంటి ఎంట్రీ ఇప్పిస్తుందో చూడాలి మరి... 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement