విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగులోనే దక్షిణాది, ఉత్తరాది చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు జగపతిబాబు. ఈయన 2018లో ‘గ్యాంగ్‌స్టర్’ అనే వెబ్ సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. అయితే కాస్త గ్యాప్ తర్వాత మరోసారి ఈయన మరో వెబ్ సిరీస్‌లో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ‘బాహుబలి’ చిత్రాన్ని నిర్మించిన ఆర్కామీడియా బ్యానర్లో రూపొందబోయే వెబ్ సిరీస్‌లో జగపతిబాబు నటించడానికి ఓకే చెప్పేశారట. కరోనా పరిస్థితుల నుండి కాస్త కుదుటపడగానే ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తారట. ప్రస్తుతానికైతే సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలు పెట్టాలనే ఆలోచనలో నిర్మాతలున్నట్లు టాక్.