Abn logo
May 21 2020 @ 18:05PM

జగ్గూ భాయ్ వదిలిన ‘ఏ’ మోషన్ పోస్టర్

తొలి చిత్రంలోనే 3 విభిన్నమైన పాత్రలు పోషిస్తున్న నితిన్ ప్రసన్న హీరోగా.. ‘మళ్ళీరావా, ప్రెషర్ కుక్కర్’ చిత్రాలలో పక్కింటి అమ్మాయిగా కనిపించిన ప్రీతి అశ్రాని హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఏ’. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రం యొక్క మోషన్ పోస్టర్‌ను సంచలన నటుడు జగపతిబాబు విడుదల చేశారు. మొదటి నుంచి ఈ చిత్ర బృందం విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు విడుదల చేసిన మోషన్ పోస్టర్ కూడా ప్రేక్షకులలో మరింతగా అంచనాలను పెంచేలా వుంది. ఈ సందర్భంగా త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తామని, ఖచ్చితంగా రాబోయే టీజర్ కూడా ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని చిత్రయూనిట్ తెలిపింది. 


లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకి ఏకలవ్య శిష్యుడైన యుగంధర్ ముని మేకింగ్ స్టైల్ కూడా తన గురువులానే ఉండటం విశేషం. ఫిల్మ్ స్కూల్ నేపథ్యం నుండి వచ్చిన దర్శకుడు తన జట్టును కూడా అదే తరహాలో ఎన్నుకున్నాడు. కెమెరామెన్ ప్రవీణ్ కె బంగారి(ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్ బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్ సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డు విన్నర్), ఆనంద్ పవన్ మరియు మణికందన్ ఎడిటింగ్ (ఎఫ్‌టిఐఐ). చిత్రంలోని అన్ని పాటలను అనంత శ్రీరామ్ రచించగా.. దీపు మరియూ పావని ఆలపించారు. విజయ్ కూరాకుల సంగీతం అందించారు.

Advertisement
Advertisement
Advertisement