Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 26 May 2022 09:03:42 IST

Jagapathi Babu: వెంకీ - సల్మాన్ సినిమాలో కన్‌ఫర్మ్..?

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా కభీ ఈద్ కభీ దివాలీ (Kabhi Eid Kabhi Diwali) అనే సినిమా మొదలవబోతోంది. కంప్లీట్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే (Pooja Hegde) సల్మాన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. పూజా ఇందులో వెంకీకి చెల్లిగా కనిపించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్‌లో జరగనుందట.

అయితే, తాజా సమాచారం ప్రకారం, కభీ ఈద్ కభీ దివాలీ చిత్రంలో విలన్‌గా టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu)ను ఎంపిక చేసుకున్నట్టు తెలిస్తోంది. పలువురు బాలీవుడ్ నటులను పరిశీలించిన మేకర్స్ ఈ మూవీలో పాత్రకు జగ్గుభాయ్ తప్ప మరెవరూ సూటవరని ఆయననే ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇది వరకే సల్మాన్ నటించిన సినిమాలలో జగపతి బాబు నటించాచాల్సి ఉంది. కానీ డేట్స్ సర్దుబాటు కాక కుదరలేదు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ అవకాశం దక్కింది. 

ఈ సినిమాకు దర్శకుడు ఫర్హాద్ సామ్జీ. జూన్ నుంచి ఈ మూవీ సెట్స్‌పైకి రాబోతోంది. ఇక సల్మాన్ టాలీవుడ్ లెజండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఇందులో నయనతార, సత్యదేవ్, దర్శకుడు పూరి జగన్నాథ్ ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే చిరు - సల్మాన్‌పై టాకీపార్ట్ కంప్లీట్ అయింది. ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement