వచ్చే నెల మూడున జగన్నాథ స్వామి రథయాత్ర

ABN , First Publish Date - 2022-06-26T05:11:16+05:30 IST

జిల్లా కేంద్రంలో వచ్చే నెల మూడున జగ్ననాథ స్వామి రథయాత్ర నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, ఇస్కాన్‌ సంస్థ ప్రతినిథులు ఉదయశ్రీ, దత్తురావు తెలిపారు.

వచ్చే నెల మూడున జగన్నాథ స్వామి రథయాత్ర

మహబూబ్‌నగర్‌ టౌన్‌/ పద్మావతీ కాలనీ, జూన్‌ 25 : జిల్లా కేంద్రంలో వచ్చే నెల మూడున జగ్ననాథ స్వామి రథయాత్ర నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, ఇస్కాన్‌ సంస్థ ప్రతినిథులు ఉదయశ్రీ, దత్తురావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రామకృష్ణ సేవా సమితి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన స మావేశంలో వారు మాట్లాడుతూ ఇస్కాన్‌ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ధార్మిక సంస్థ ల సహకారంతో శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూరీ క్షేత్రానికి వెళ్లలే ని ప్రజల కోసం శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తున్నామని, యూరోపియన్‌ దేశాలకు చెం దిన విదేశీయులు కూడా స్వామి వారిని దర్శించుకుంటారని తెలిపారు. అనంతరం శ్రీజగన్నాథ రథయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో పట్టణ ప్రముఖులు పాండురంగం, లక్ష్మణ్‌, సురేందర్‌గౌడ్‌, బాలరాజు, హేమసుందర మూర్తి, సుధాకర్‌, రామరాజు, రాజమల్లేష్‌, వినయ్‌కుమార్‌, భరత్‌కుమార్‌ పాల్గొన్నారు.


పోలీసులు సాధించే విజయం సమాజాభివృద్ధికి దోహదం

- వీసీలో డీజీపీ మహేందర్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, జూన్‌ 25 : పోలీసులు ప్రజల కోసమే పనిచేస్తున్నారని, పోలీసులు సాధించే ప్రతీ విజయం శాంతిభద్రతలను మరింత మెరుగుపరు స్తుందని, సమాజాభివృద్ధికి దోహదం చేస్తుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నా రు. శనివారం ఆయన జిల్లాల పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర నివారణతోపాటు న్యా యస్థానం ద్వారా నిందితులకు తగిన శిక్ష పడేందుకు పోలీసులు చేస్తున్న కృషి మంచి ఫలితాలనిస్తోందన్నారు. వీసీలో పాల్గొన్న జిల్లా అడిషనల్‌ ఎస్పీ రాము లు జిల్లాలో శాఖాపరంగా తీసుకుంటున్న పలు అంశాలను వివరించారు. నేర నివారణకు పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచుతున్నామని, పెట్రోలింగ్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. విద్యాలయాలలో షీ పోలీసు, కళా బృందాల ద్వారా చట్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వ హిస్తున్నామని వెల్లడించారు. బాలలు, మహిళల రక్షణకై ఉన్న చట్టాలను వివ రిస్తూ తప్పుగా ప్రవర్తించే వారిపై నిర్భయంగా పోలీసులకు సమాచారం ఇవ్వా లని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్డెన్‌ సెర్చ్‌ గ్రామ పోలీ సు అధికారులతో చేస్తున్న సమావేశాల ద్వారా ప్రజలు, యువతతో స్నేహ పూర్వక వాతావరణం ఉండేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు మహేశ్‌, వెంకటరమణారెడ్డి, మధు, ఆదినారాయణ, శ్రీనివాసులు, ఇన్స్‌పెక్టర్లు, పాల్గొన్నారు. 


ఆన్‌లైన్‌ ఉద్యోగం పేరుతో రూ.3 లక్షలు స్వాహా

మహబూబ్‌నగర్‌, జూన్‌ 25 : ఆన్‌లైన్‌ ఉద్యోగం పేరుతో సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు ఖాతానుంచి రూ. మూడు లక్షలు స్వాహా చేశారు. పట్టణంలోని మై త్రీనగర్‌కు చెందిన విద్యార్థి సాయిశ్రీకి ఆమెజాన్‌  మిషన్‌ హాల్‌ అనే వెబ్‌సైట్‌నుంచి ఒక వాట్సప్‌ మెసేజ్‌ వచ్చింది. వర్క్‌ఫ్రంహోం అని వెబ్‌సైట్‌లో ఇన్వెస్ట్‌ చేయమని చెప్పారు. ఇన్వెస్ట్‌ చేశాక టాస్క్‌ లు పూర్తిచేసి అమౌంట్‌ విత్‌డ్రా చేసుకోమని చె ప్పారు. నమ్మిన సాయిశ్రీ కొంత అమౌంట్‌ ఇన్వెస్ట్‌ చేసి టాస్క్‌లు పూర్తి చేసింది. తరువాత డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి అడిగితే డబ్బులు ఇవ్వడం లేదు. ఈనెల22,23 తేదీలలోదాదాపు రూ. మూడు లక్షలు పలు ఖాతాల ద్వారా సైబర్‌ నేరగాళ్ల ఖాతా కు పంపించింది. విత్‌డ్రాకు అవకాశం ఇవ్వకపోవ డంతో మోసపోయానని భావించిన ఆమె శని వారం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

మహబూబ్‌నగర్‌, జూన్‌ 25 : రోడ్డుపై వెళ్తున్న మహిళను ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. కోయిల కొండ మండలం పారుపల్లికి చెందిన గోవిందమ్మ బండమీదిపల్లిలో నివాసం ఉంటూ పాలమూరు యూనివర్సిటీ మహిళా హాస్టల్‌లో వంటమనిషిగా పని చేస్తుంది. ఈనెల 23న సాయంత్రం పని ము గించుకుని ఇంటికి వస్తుండగా రాత్రి 7:30 గంటల సమయంలో ఎండి సలీంపాషా తన ద్విచ క్ర వాహనాన్ని వేగంగా వెళ్తూఢీకొనడంతో ఆమెకాలు విరిగింది. శనివారం బాధితురాలి సోదరుడు వెం కటేశ్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


ముగ్గురు మహిళల  అదృశ ్యం

మహబూబ్‌నగర్‌, జూన్‌ 25 : వేర్వేరు ఘటన ల్లో ముగ్గురు మహిళలు అదృశ్యం అయ్యారు. శని వారం బాధిత కుటుంబ సభ్యులు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసు లు మిస్సింగ్‌ కేసులు నమోదుచేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు. పట్టణంలోని విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన సంతోష్‌రాథోడ్‌ జోమోటో డెలివరి బాయ్‌ గాపనిచేస్తున్నాడు. 2019లో జరుపుల రేణుక (24) ను వివాహం చేసుకోగా వీరికి కూతురు ఉన్నారు. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవ జరిగితే రేణుక అలిగి వెళ్లిపోయి పెద్దల పంచాయితీతో తిరి గి వచ్చేది. ఈనెల 24న కూతురిని తీసుకుని రేణు క వెళ్లిపోయింది. ఆమెకోసం భర్త వెతికినా ఆచూకీ లభించలేదు. తెలిసిన వారివద్ద వెతికినా ఆచూకి లేకపోవడంతో శనివారం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఫ అదేవిధంగా మద్దూరు మండలం అల్లీపూర్‌ కు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి బండమీదిపల్లి రాజీవ్‌ గృహకల్పలో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుం టున్నాడు. ఈయనకు 2006లో ఎదిరకు చెందిన లావణ్య (41)తో వివాహం జరిగింది. ఈనెల 22న చంద్రశేఖర్‌రెడ్డి సొంతూరికి వెళ్లగా లావణ్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెకోసం వెతికినా ఆచూకీ  తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. 

ఫ మండలంలోని మణికొండకు చెందిన గోరి అంజమ్మ (40) ఈనెల 23నుంచి కనిపించడం లే దని ఆమె సోదరుడు పుట్టపల్లి నాగరాజు శనివా రం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంజ మ్మ కోడూర్‌ దగ్గర రైలు ఎక్కినట్లు గ్రామస్థుడు రాములు చెప్పడంతో  ఆమెకోసం రైల్వే స్టేషన్‌లలో వెతికారు. మతిస్థిమితం సరిగా లేదని రైలు ఎక్కి ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని, తమ సోదరి ఆచూకీ తెలుపాలంటూ నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-06-26T05:11:16+05:30 IST