72,784 మందికి జగనన్న విద్యాదీవెన

ABN , First Publish Date - 2021-07-30T05:28:21+05:30 IST

జగనన్న విద్యాదీవెనలో భాగంగా గురువారం జిల్లాలోని 72,784 మందికి రూ.47.25 కోట్లు విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన వీడియో కాన్ఫరెన్సు ద్వారా 2020-21

72,784 మందికి జగనన్న విద్యాదీవెన
మెగా చెక్కును విద్యార్థుల తల్లులకు అందజేస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు, ప్రజాప్రతినిధులు

కడప (కలెక్టరేట్‌), జూలై 29: జగనన్న విద్యాదీవెనలో భాగంగా గురువారం జిల్లాలోని 72,784 మందికి రూ.47.25 కోట్లు విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన వీడియో కాన్ఫరెన్సు ద్వారా 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి రెండవ విడత జగనన్న విద్యాదీవెన లబ్ధిని కంప్యూటర్‌ బటన నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స హాలులో కలెక్టర్‌ విజయరామరాజుతో పాటు ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, రాష్ట్ర పరిశ్రమల అబివృద్ధి సలహాదారులు రాజోలి వీరారెడ్డి, అనుడా చైరన గురుమోహన, జేసీ ధర్మచంద్రారెడ్డి హాజరయ్యారు. సీఎం వీడియో కాన్ఫరెన్స ముగిసిన అనంతరం 2020-21 విద్యాసంవత్సరానికి రెండవ విడతగా జిల్లాలోని విద్యార్థులకు మంజూరైన జగనన్న విద్యాదీవెన లబ్ధి మొత్తం రూ.47.25 కోట్ల మెగా చెక్కును కలెక్టర్‌తో పాటు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని సమాజ అభివృద్ధిలో ప్రతిఒక్కరూ ప్రధాన భూమిక పోషించాలని కోరారు.

Updated Date - 2021-07-30T05:28:21+05:30 IST