కదలిన జగన్నాథ రథ చక్రాలు

ABN , First Publish Date - 2022-07-02T06:34:44+05:30 IST

భక్తుల జయజయఽ ద్వానాల మధ్య జగన్నాథుని రథ చక్రాలు కదిలాయి.

కదలిన జగన్నాథ రథ చక్రాలు
టౌన్‌ కొత్తరోడ్డులోని జగన్నాఽథ స్వామి రథయాత్రలో పాల్గొన్న భక్తులు. (ఇన్‌సెట్‌) బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథ స్వామి

జిల్లాలో ఘనంగా రథయాత్ర 

వేలాదిగా పాల్గొన్న భక్తులు 

నేటి నుంచి దశావతారాల్లో దర్శనమివ్వనున్న స్వామి


భక్తుల జయజయఽ ద్వానాల మధ్య జగన్నాథుని రథ చక్రాలు కదిలాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అత్యంత వైభవంగా జగన్నాథ రథయాత్ర సాగింది. వేలాదిగా పాల్గొన్న భక్తజనం రథాలను లాగేందుకు పోటీపడ్డారు. టౌన్‌ కొత్తరోడ్డులోని జగన్నాఽథ స్వామి  ఆలయం నుంచి బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథ స్వామి తొలి రథయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా పూర్ణామార్కెట్‌ జనంతో కిక్కిరిసిపోయింది. టౌర్నర్‌ చౌల్ర్టీలోని కల్యాణ మండపంలో విగ్రహాలను ప్రతిష్ఠించి, పూజలు చేయడంతో ఉత్సవం ముగిసింది. కాగా శనివారం నుంచి జగన్నాథుడు దశావతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇస్కాన్‌ విశాఖ శాఖ అధ్యక్షుడు సాంబదాస్‌ సారథ్యంలో రథయాత్ర వైభవంగా జరిగింది.డాబాగార్డెన్స్‌, జగదాంబ మీదుగా సిరిపురం గురజాడ కళాక్షేత్రం వరకు చేరుకున్న తరువాత రథాలలోని స్వామి విగ్రహాలకు అమెరికా, బ్రెజిల్‌, రష్యాకు చెందిన ఇస్కాన్‌ ప్రతినిధులు హరేకృష్ణ మహామంత్రాన్ని గానం చేసి పూజించారు. 



Updated Date - 2022-07-02T06:34:44+05:30 IST