జగనన్న విద్యాదీవెన కిట్ల పంపిణీ ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-23T06:26:14+05:30 IST

సామర్లకోట, మే 22: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న విద్యాదీవెన కిట్ల పంపిణీ జిల్లావ్యాప్తంగా ప్రారంభించినట్టు సర్వశిక్షాభియాన్‌ కమ్యూనిటీ మొబలైజేషన్‌ అధికారి వైవీ.శివరామకృష్ణయ్య వెల్లడించారు. ఆదివారం సామర్లకోటలో సీఎంవో మాట్లాడుతూ

జగనన్న విద్యాదీవెన కిట్ల పంపిణీ ప్రారంభం

సామర్లకోట, మే 22: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న విద్యాదీవెన కిట్ల పంపిణీ జిల్లావ్యాప్తంగా ప్రారంభించినట్టు సర్వశిక్షాభియాన్‌ కమ్యూనిటీ మొబలైజేషన్‌ అధికారి వైవీ.శివరామకృష్ణయ్య వెల్లడించారు. ఆదివారం సామర్లకోటలో సీఎంవో మాట్లాడుతూ ఇప్పటివరకూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 10 మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాదీవెన కిట్లను పంపిణీ పూర్తి చేశామన్నారు. వాటిలో చింతూరు, వీఆర్‌.పురం, కూనవరం, నెల్లిపాక, రంపచోడవరం, దేవీపట్నం, సీతానగరం, కోరుకొండ, గోకవరం, గంగవరం ఏజెన్సీ మండలాలు ఉన్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా 55,743 మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన కిట్లు మంజూరయ్యాయని సీఎంవో శివరామకృష్ణయ్య తెలిపారు. 

Updated Date - 2022-05-23T06:26:14+05:30 IST