జగన్న విద్యా కిట్స్‌.. వచ్చేశాయ్‌

ABN , First Publish Date - 2021-05-17T05:58:31+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా పంపిణీ చేసే జగన్న విద్యా కిట్స్‌ మండల స్థాయిలో విద్యావనరుల కేంద్రాలకు చేరాయి.

జగన్న విద్యా కిట్స్‌.. వచ్చేశాయ్‌
జగన్న విద్యాకిట్స్‌తో విద్యార్థులు

జిల్లాకు 4.18 లక్షల కిట్స్‌ కేటాయింపు

విద్యా వనరుల కేంద్రాలకు చేరిన కిట్లు

గుంటూరు(విద్య), మే 16:  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా పంపిణీ చేసే జగన్న విద్యా కిట్స్‌ మండల స్థాయిలో విద్యావనరుల కేంద్రాలకు చేరాయి. పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే నాటికి విద్యార్థులకు జగన్న విద్యాకిట్లు పంపిణీ చేయడానికి విద్యాశాఖ, సమగ్రశిక్షా అభియాన్‌ ప్రణాళికలు సిద్ధం చేశాయి. జిల్లాకు 4.18 లక్షల కిట్లు మంజూరు అయినట్లు సమగ్రశిక్షా అభియాన్‌ అధికారులు ప్రకటించారు. స్కూల్‌ కాంప్లెక్సులు, విద్యావనరుల కేంద్రాల్లో జగనన్న విద్యా కిట్లను భద్రపరుస్తామని తెలిపారు. కిట్లలో నాణ్యతా లోపం ఉంటే ప్రధానోపాధ్యాయులు వాటిని తిరిగి పంపవచ్చునని తెలిపారు. ప్రతి స్కూల్‌ కాంప్లెక్స్‌కు అందిన స్టాక్‌ను వస్తువుల వారీగా రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.  స్టాక్‌ రిజిస్ట్రర్‌ వివరాలు ఎప్పటికప్పుడు జగనన్న విద్యాకానుక యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది  ఇదిలా ఉంటే ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు మొత్తం 4,18,678 కిట్లు మంజూరు కాగా వాటిలో బాలికలకు 2,08,380 కిట్లు, బాలురకు 2,10,298 కిట్లు అందించనున్నట్లు తెలిపారు.

తరగతుల వారీగా కేటాయింపులు ఇలా...

తరగతి వచ్చిన కిట్లు

1వ తరగతి 43,099

2వ తరగతి 43,099

3వ తరగతి 43,705

4వ తరగతి 41,715

5వ తరగతి 41,103

6వ తరగతి 40,492

7వ తరగతి 42,816

8వ తరగతి 42,611

9వ తరగతి 40,984

10వ తరగతి         39,054

మొత్తం         4,18,678

Updated Date - 2021-05-17T05:58:31+05:30 IST