అమరావతి: జగనన్న తోడు పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మహన్ రెడ్డి బుధవారం క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందజేస్తామన్నారు. ఇప్పటి వరకు 6.40 లక్షల మంది చిరువ్యాపారులను గుర్తించామన్నారు. 10 లక్షల మంది లబ్ధిదారులకు రుణాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు.
తాను పాదయాత్ర చేసిన సమయంలో చిరు వ్యాపారుల కష్టాన్ని చూశానని సీఎం జగన్ అన్నారు. చిరువ్యాపారులకు శ్రమ ఎక్కువ.. లాభం తక్కువని అన్నారు. చిరు వ్యాపారుల జీవితాల్లో మార్పు తీసుకొస్తామన్నారు. చిరువ్యాపారులు లేకపోతే ఆర్థిక వ్యవస్థ కూడా నడవదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది లబ్ధిదారులకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.