జగనన్న లేఅవుట్‌లో కనీస వసతులు లేవు

ABN , First Publish Date - 2022-08-18T06:03:52+05:30 IST

గ్రామానికి దూరంగా జగనన్న కాలనీ లేఅవుట్‌లు ఇవ్వటంతో అక్కడకు వెళ్లలేమని, కనీస వసతులు కూడా లేవని లబ్ధిదారులు ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో అన్నారు.

జగనన్న లేఅవుట్‌లో కనీస వసతులు లేవు
మహిళతో మాట్లాడుతున్న ఉదయభాను

గడప గడపకూ మన ప్రభుత్వంలో  

ఎమ్మెల్యే ఉదయభానుకు సమస్యలు ఏకరువు

జగ్గయ్యపేట రూరల్‌ : గ్రామానికి దూరంగా జగనన్న కాలనీ లేఅవుట్‌లు ఇవ్వటంతో అక్కడకు వెళ్లలేమని, కనీస వసతులు కూడా లేవని లబ్ధిదారులు ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో అన్నారు. తక్కెళ్లపాడులో బుధవారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేకు ప్రజలు సమస్యలతో స్వాగతం పలికారు. వీటిపై స్పందించిన ఆయన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమస్యలను ప్రాధాన్యక్రమంలో పరిష్క రిస్తామన్నారు. కేడీసీసీ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-18T06:03:52+05:30 IST