జగనన్నా.. నాసిరకం బ్యాగులిచ్చారు!

ABN , First Publish Date - 2022-07-29T09:35:08+05:30 IST

జగనన్నా.. నాసిరకం బ్యాగులిచ్చారు!

జగనన్నా.. నాసిరకం బ్యాగులిచ్చారు!

‘విద్యాకానుక’పై విద్యార్థుల పెదవి విరుపు

లక్కవరపుకోట, జూలై 28: జగనన్న విద్యాకానుకలో భాగంగా ఇచ్చిన బ్యాగులు నాసిరకంగా ఉన్నాయని, రంధ్రాలతో వచ్చాయని, జిప్పులు కూడా సరిగా పనిచేయడం లేదని విద్యార్థులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా లక్కవరపు కోట మండలంలోని వివిధ పాఠశాలలను ‘ఆంధ్రజ్యోతి’ గురువారం సందర్శించి విద్యార్థులతో మాట్లాడింది. చాలా మంది గతంలో ఇచ్చిన బ్యాగులకంటే చిన్నవిగా, పలుచగా ఉన్నాయని తెలిపారు. పెద్ద తరగతుల పుస్తకాలన్నీ బ్యాగుల్లో పట్టడం లేదని వాపోయారు. కుట్లు వదిలేస్తున్నాయని, బూట్లు కూడా నాసిరకంగా ఉన్నాయని వివరించారు. 

Updated Date - 2022-07-29T09:35:08+05:30 IST