కీచక సమూహానికి జగన నాయకత్వం

ABN , First Publish Date - 2022-08-12T05:54:07+05:30 IST

వైసీపీలోని కీచక సమూహానికి జగన నాయత్వం వహిస్తున్నాడని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.

కీచక సమూహానికి జగన నాయకత్వం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు

గోరంట్ల మాధవ్‌ పోరంబోకు కంటే నీచమైనోడు 

అతన్ని జగన వెనకేసుకురావడం సిగ్గుచేటు 

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు 

అనంతపురం అర్బన, ఆగస్టు 11: వైసీపీలోని కీచక సమూహానికి జగన నాయత్వం వహిస్తున్నాడని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో, పార్టీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడుతో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బటన  నొక్కిన, బటన విప్పిన ఎంపీకి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గోరంట్ల మాధవ్‌ పోరంబోకు కంటే పనికిమాలినోడని అన్నారు. మాధవ్‌ వ్యవహారాన్ని నిర్లజ్జగా సీఎం జగన వెనకేసుకురావడం సిగ్గుచేటని అన్నారు. న్యూడ్‌ వీడియోపై జగన దాగుడు మూతలు ఆడినా, నిజాన్ని సమాధి చేయాలని చేసినా, మాధవ్‌ నగ్న దృశ్యాలు చూసిన ప్రజలు చీకొడుతున్నారని అన్నారు. లక్షలాది మంది నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేశారన్నారు. న్యూడ్‌ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవే అని కోట్లాది మంది ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. ఆ వీడియోలో ఉన్నది మాధవ్‌ కాదని కాకమ్మ కబుర్లు చెబితే వినేందుకు ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. తాడేపల్లి నుంచి సజ్జల పంపిన స్ర్కిప్ట్‌ను జిల్లా ఎస్పీ చదివాడని అన్నారు. న్యూడ్‌ వీడియో బయటకు వచ్చిన రోజు అది నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జల ప్రకటించారని గుర్తు చేశారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో వీడియోలో ఉన్నది మాధవ్‌ అని తేలిన తర్వాత నిజాన్ని కప్పిపుచ్చేందుకు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఫోరెన్సిక్‌ నివేదికను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్‌  చేశారు. పోలీసు విచారణలో వెల్లడైన నిజాలను తొక్కి పెట్టి, ఎస్పీతో అబద్ధాలను చెప్పించారని అన్నారు. మాధవ్‌ నిజాయితీపరుడైతే స్వచ్ఛందంగా దర్యాప్తు ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. తన సెల్‌ఫోనను పోలీసులకు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. మాధవ్‌ సెల్‌ఫోనను సీజ్‌ చేస్తే అసలు వీడియో దొరుకుతుందని అన్నారు. ఎస్పీ ప్రకటించిన విధంగా వీడియో మార్ఫింగ్‌ చేసినట్లు నిరూపించాలని డిమాండ్‌ చేశారు. ‘మీరు నిరూపించలేమని,  అసమర్థులమని చెబితే సెంట్రల్‌ ల్యాబ్‌కు పంపించి నిజానిజాలు నిగ్గు తేలుస్తాం’ అని కాలవ సవాలు విసిరారు. 


శీల పరీక్ష చేయించుకోవాలి: పార్థ

సోషల్‌ మీడియాలో మాధవ్‌ నగ్న శరీరాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చూసి అసహ్యించుకుంటున్నారని టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి అన్నారు. మాధవ్‌ శీల పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఆయన న్యూడ్‌ వీడియోపై హోం మంత్రి, సజ్జల, అనంతపురం జిల్లా ఎస్పీ భిన్నమైన ప్రకటనలు చేశారని అన్నారు. ఒరిజనల్‌ వీడియో దొరికితేనే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో తేలుతుందని ఎస్పీ చెప్పారని, నిజాలు దాచిపెట్టడం సిగ్గుచేటని అన్నారు. వాస్తవాలను ప్రసారం చేసిన మీడియాను, చంద్రబాబునాయుడు, నారా లోకే్‌షను ఇష్టానుసారంగా మాట్లాడిన మాఽధవ్‌ మనిషేకాదని, పశువు కంటే హీనమైనోడని మండిపడ్డారు. న్యూడ్‌ వీడియోను మార్ఫింగ్‌ చేశారని ఎస్పీ ప్రకటించడంతో.. తాను నెగ్గినట్టు సిగ్గు ఎగ్గు లేకుండా మాధవ్‌ మాట్లాడారని అన్నారు. మాధవ్‌ చేసిన పనికిమాలిన పనికి, ఓట్లేసి గెలిపించిన హిందూపురం ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. మాధవ్‌ నోరును ఫినాయిల్‌ వేసి కడగాలని అన్నారు. ‘నీవు నిజంగా సచ్చీలుడువైతే ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలువు’ అని సవాల్‌ విసిరారు. మాధవ్‌ను కురుబ కులం నుంచి వెలివేయాలని అన్నారు. 


మాధవ్‌వి వికృత చేష్టలు

బట్టలు లేకుండా ఎంపీ గోరంట్ల మాధవ్‌ చేసిన వికృత చేష్టలను చూసి ప్రజ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇనచార్జి ఉమామహేశ్వరనాయుడు అన్నారు. సిగ్గులేని పని చేసి, టీడీపీ సోషల్‌ మీడియాకు  ఆపాదించడం, చంద్రబాబు, నారా లోకేష్‌, మీడియా ప్రతినిధులను నోటికి వచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. అవినీతి పార్టీగా పుట్టి, రాసలీలల పార్టీగా వైసీపీ మారిందని,  భవిష్యతలో ఇంకా ఎలా మారుతుందోని అర్థం కావడం లేదని అన్నారు. గోరంట్ల మాధవ్‌కు ఎంపీగా కొనసాగేందుకు అర్హత లేదని అన్నారు. జిల్లా కురబలు పద్ధతిగా, కష్టపడి బతికే పరిస్థితి ఉందని అన్నారు. కర్నూలు జిల్లా నుంచి వచ్చినా, ఆయనను ఎంపీగా గెలిపించారని, అలాంటి కురుబలకు మర్యాద లేకుండా చేశాడని అన్నారు. దోపిడీదారులు, దొంగలు, రేపిస్టులకు జగన వత్తాసు పలకడం దురదృష్టకరమని అన్నారు. టీడీపీ హయాంలో చిన్న ఆరోణ వచ్చినా తమ పార్టీ నాయకులపై చంద్రబాబు చర్యలు తీసుకునేవారని అన్నారు. టీడీపీలో లక్షలాది మం ది కార్యకర్తలున్నారని, ఇష్టానుసారంగా మాట్లాడితే అంతుచూస్తారని మాధవ్‌ను హెచ్చరించారు. చంద్రబాబు, లోకేష్‌ నాయకత్వంలో ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి, ప్రాణత్యాగాలకు వెనుకాడేది లేదని అన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, వైసీపీ ఆంబోతుల మదం అణచివేయడం ఖాయమని అన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు తలారి ఆదినారాయణ, దేవళ్ల మురళి తదితరులు పాల్గొన్నారు. 



దురహంకారం పనికిరాదు : బీవీ

అనంతపురం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): న్యూడ్‌ వీడియో వ్యవహారంలో చట్టపరంగా నిరూపించుకోవాల్సిందిపోయి నోరుపారేసుకోవడం తగదని ఎంపీ గోరంట్ల మాధవ్‌కు టీడీపీ  సీమ జోన మీడియా కో-ఆర్డినేటర్‌ బీవీ వెంకటరాముడు హితవు పలికారు. ఎంపీ హోదాలో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. న్యూడ్‌ వీడియోలో ఉన్నదెవరో దేశ ప్రజలందరూ గుర్తించారని అన్నారు. ఎస్పీ ప్రకటనతో క్లీనచిట్‌ ఇచ్చారన్న భ్రమలో గోరంట్ల మాధవ్‌ ఉన్నారని, తమ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకే్‌షపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వాస్తవాలను బయటపెట్టిన మీడియా యాజమాన్యాలపై నోరుపారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అధికార పార్టీలో తప్పుడు పనులు పనిచేసేవారిని ప్రభుత్వమే వెనకేసుకొస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి తానేటి వనిత, ఎస్పీ ఫక్కీరప్ప మీడియాకు వెల్లడించిన అంశాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. 



దొరికిపోయి దుర్భాషలా..?

గోరంట్ల మాధవ్‌పై ఎంఎస్‌ రాజు ఫైర్‌

అనంతపురం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): మొండిమొలతో దొరికిపోయిన ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఆ వీడియో తనది కాదని చెబితే నమ్మేస్థితిలో ప్రజలు లేరని టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు అన్నారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబునాయుడు, లోకే్‌షను తిడితే సహించేది లేదని హెచ్చరించారు. మరోసారి నోరు పారేసుకుంటే తోలు తీస్తామని హెచ్చరించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. ఎంపీ మాధవ్‌ చేసిన నికృష్టమైన పనిని చూసి ఆయన కులం, కుటుంబం చీదరించుకుంటున్నాయని అన్నారు. ఏబీఎన-ఆంధ్రజ్యోతి, టీవీ-5 యాజమాన్యాలను దుర్భాషలాడినంత మాత్రాన నిజం  అబద్ధంగా మారదని అన్నారు. ప్రాథమిక విచారణ చేయకుండా, న్యూడ్‌ వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపకుండా.. ఫేక్‌ అని ఎలా నిర్ధారిస్తారని ఎస్పీని ప్రశ్నించారు. సీమ జిల్లాల్లో కురుబ కులస్థులకు ఘనమైన చరిత్ర ఉందని, సొంత కులస్థులే చీదరించుకునేలా గోరం ట్ల మాధవ్‌ వ్యవహరించారని అన్నారు. ఇప్పటికైనా దుర్భాషలు మాని, కురబలు తలెత్తుకుని తిరిగేలా వ్యవహరించాలని హితవు పలికారు.


Updated Date - 2022-08-12T05:54:07+05:30 IST