Abn logo
Aug 23 2021 @ 15:45PM

జగన్, నేను పోటీ చేస్తే.. నేనే గెలుస్తా: రఘురామ

ఢిల్లీ: ‘‘నర్సాపురంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం జగన్, నేను పోటీ చేస్తే నేనే గెలుస్తా’’ అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. సర్వేలో జగన్ కంటే తనకు 19 శాతం ఎక్కువ వచ్చిందని వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి, ద్వారకానాథ్‌రెడ్డి మినహా మరెవరూ మళ్లీ గెలవరని జోస్యం చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 50 స్థానాలు మించి వైసీపీకి రావని తెలిపారు. పశ్చిమగోదావరిజిల్లాలో ఒకరిద్దరు తప్ప వైసీపీ ఎమ్మెల్యేలందరికీ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. మాజీమంత్రి వైఎస్‌ వివేకా హత్యలో ఎవరి ప్రమేయం ఎంత ఉందోనని ప్రజలకు అనుమానం ఉందన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డిని సీబీఐ విచారించాలని రఘురమకృష్ణరాజు కోరారు.