ముస్లింలను మోసగించిన జగన్‌

ABN , First Publish Date - 2022-06-30T04:45:37+05:30 IST

మస్లింలను జగన్‌రెడ్డి నిలువునా మోసగించారని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎండీ యూసఫ్‌ అన్నారు.

ముస్లింలను మోసగించిన జగన్‌
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఎండీ యూసఫ్‌

భావితరాల కోసం పోరాడాలి

ఎస్‌ఎండీ యూసఫ్‌ పిలుపు

పెద్ద దోర్నాల, జూన్‌ 29 : మస్లింలను జగన్‌రెడ్డి నిలువునా మోసగించారని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎండీ యూసఫ్‌ అన్నారు. టీడీపీ కార్యాయలంలో ఒంగోలు పార్లమెంట్‌ ఉఫాధ్యక్షుడు షేక్‌ సమ్మద్‌ బాషా అధ్యక్షతన  ముస్లింలు బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూసఫ్‌ మాట్లాడుతూ పిల్లల భావితరాల హక్కుల కోసం ముస్లింలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక్క చాన్స్‌ అంటూ ముస్లింలపై ప్రత్యేక అభిమానం ఉన్నట్లు నటించి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ మైనారిటీలకు అన్యాయం చేశారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హ యాంలో ముస్లిం అభ్యున్నతి కోసం అమలు చేసిన పథకాలన్నింటినీ వైసీపీ రద్దు చేసింద న్నారు.  దుల్హన్‌ పథకంతో మొదలుకొని రంజా న్‌ తోఫా, విదేశీ విద్య, ఎన్టీఆర్‌ విద్యోన్నతి, తత్కాల్‌, దుకాన్‌ మకాన్‌, ఇస్లామిక్‌ బ్యాంకు పథకాలకు వైసీపీ మంగళం పాడిందన్నారు. మౌజన్‌, ఇమామ్‌లకు అందజేసే గౌరవ వేత నం రూ.15,000, గృహాల మంజూరు, మసీదుల మరమ్మతులకు నిధులు నిధుల కేటాయించలేదన్నారు. హజ్‌ యాత్రకు ఆర్థిక సాయం కరువైందన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెం దిన ముస్లింలకు రూ.7లక్షల బీమా  లేద న్నారు. ముస్లింలకు సబ్‌ప్లాన్‌ నిధులు ఏమ య్యాయని ఆయన ప్రశ్నించారు. అన్నీ రద్దు చేసి జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. నామినేటెడ్‌ పదవుల్లో, ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో  50 శాతం రిజర్వేషన్ల  ఊసేలేదన్నారు. మహిళలకు 45 ఏళ్లకే పిం ఛన్‌ మంజూరు చేస్తామని జగన్‌ మాట తప్పారన్నారు. యువతకు రుణాలు లేవు. ప్రతి నియోజకవర్గానికీ షాదీఖానా హామీ మరి చారన్నారు. పాత వాటిని బాగు చేసే దిక్కే లేదన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ముస్లిం లను నిలువునా జగన్‌రెడ్డి మోసం చేశార న్నారు. ఈ నేపథ్యంలో మన బిడ్డల భవిష్యత్‌ కోసం ఐక్యంగా ఉద్యమించాలన్నారు. సమా వేశంలో రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శి షేక్‌ జిలాని, ఒంగోలు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు  షేక్‌ మహబూబ్‌బాషా, అధికార ప్రతినిధి మౌలాలి, నాయకులు షేక్‌ ఇస్మాయిల్‌, రఫీ, బాషా, తెలుగు యువత కార్యదర్శి షేక్‌ రఫీ, అహ్మద్‌, తుమ్మలయ్య పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T04:45:37+05:30 IST