విశాఖ: విశాఖ అంటే సీఎం జగన్ (Jagan)కు ప్రత్యేక అభిమానమని మంత్రి విడదల రజనీ (Vidadala Rajini) తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ జరగని అభివృద్ధి పనులు విశాఖ జిల్లాలో జరుగుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో విశాఖ మరింత అభివృద్ధి చేస్తామని విడదల రజనీ ప్రకటించారు. ఋషికొండపై ప్రతిపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. టీడీపీ అదినేత చంద్రబాబు (Chandrababu) హయాంలో అభివృద్ధి కోసం కొండలను చదును చేశారని తెలిపారు. ‘మీరు చేస్తే అభివృద్ధి.. జగన్ సర్కార్ చేస్తే విధ్వంసమా?’ అని అవంతి ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి