మంత్రులతో సరదాగా మాట్లాడిన జగన్‌

ABN , First Publish Date - 2022-04-07T23:49:21+05:30 IST

కేబినెట్‌ భేటీలో మంత్రులతో సీఎం జగన్‌ సరదాగా మాట్లాడారు. వెయ్యి రోజులు తన కేబినెట్‌లో ఉన్నారని, ఇక పార్టీ కోసం మీ సేవలు వినియోగించుకుంటానని తెలిపారు.

మంత్రులతో సరదాగా మాట్లాడిన జగన్‌

అమరావతి: కేబినెట్‌ భేటీలో మంత్రులతో సీఎం జగన్‌ సరదాగా మాట్లాడారు. వెయ్యి రోజులు తన కేబినెట్‌లో ఉన్నారని, ఇక పార్టీ కోసం మీ సేవలు వినియోగించుకుంటానని తెలిపారు. ఈ విషయాన్ని రాజీనామాల విషయంలో బాధపడుతున్నట్లు మంత్రులకు జగన్‌ తెలిపారు. సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీఎంకు మంత్రులు  చెప్పారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మంత్రులు ప్రొటోకాల్‌ వాహనాలు వెనక్కి ఇచ్చారు. 


సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పుడే ‘అందరినీ తీసేస్తాం. కొత్తవాళ్లను నియమిస్తాం’ అని తొలుత చెప్పినప్పటికీ... నలుగురికి మాత్రం ‘ఇంకోసారి’ చాన్స్‌ ఉంటుందని సమాచారం. ఆదిమూలపు సురేశ్‌, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాంలను మళ్లీ మంత్రులుగా తీసుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నా యి. బుధవారం ఢిల్లీ నుంచి రాగానే సీఎం జగన్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో సమావేశమయ్యారు. కేబినెట్‌ ప్రక్షాళనపై ఆయనకు వివరించారు. 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు.

Updated Date - 2022-04-07T23:49:21+05:30 IST