అమరావతి: సీఎం జగన్‌రెడ్డి మాట ఇచ్చాడంటే.. దానికి రివర్స్ చేస్తాడని టీడీపీ నేత నారా లోకేష్ తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి, ప్రజలకు వేసవి షాక్ ఇచ్చాడని దుయ్యబట్టారు. తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కరెంటు చార్జీలు బాదుడే.. బాదుడంటూ నాడు దీర్ఘాలు తీశాడని, ఇప్పుడు చార్జీలు భారీగా పెంచి జనానికి షాక్ కొట్టించారని మండిపడ్డారు. ‘‘మాట తప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్.. మడమ తిప్పుడుకి ఐకాన్ జగన్. సీఎం పదవి కోసం జగన్ తొక్కని అడ్డదారి లేదు’’ అని లోకేష్ ధ్వజమెత్తారు.
ఏపీలో సామాన్యులపై జగన్ సర్కార్ మరో పిడుగు వేసింది. రాష్ట్రంలో భారీగా విద్యుత్ చార్జీలు పెరిగాయి. పెరిగిన విద్యుత్ టారిఫ్‌ను బుధవారం ఏపీఈఆర్సీ చైర్మన్ విడుదల చేశారు. ఈ ప్రకారం 30 యూనిట్ల వారికి యూనిట్‌కు 45 పైసలు పెంచారు. 31 నుంచి 75 యూనిట్ల వారికి యూనిట్‌కు 95 పైసలు పెంచారు. అలాగే 126 నుంచి 225 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.57 పెంచగా, 226 నుంచి 400 యూనిట్ల వారికి యూనిట్‌కు రూ.1.16 పెంచారు. 400 యూనిట్లపైన వారికి యూనిట్‌కు రూ.55 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చినట్లు ఏపీఈఆర్సీ చైర్మన్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి