Abn logo
Jun 5 2020 @ 14:05PM

ఏపీఈఎంసీ ప్లాట్‌ఫాంని ప్రారంభించిన జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ ( ఏపీఈఎంసీ) ఫ్లాట్‌ఫాంని ముఖ్యమంత్రి జగన్‌ నేడు ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ఏపీఈఎంసీ ప్రారంభమవుతుంది. పరిశ్రమల నుంచి వ్యర్థాల నిర్వహణ బాధ్యతలను ఏపీఈఎంసీ చేపట్టనుంది. పర్యావరణ నియమాలు, నిబంధనలను కచ్చితంగా అమలు చేయనుంది. దీని కోసం దేశంలోనే మొదటిసారిగా ఆన్‌లైన్ వేస్ట్‌ ఎక్సేంజ్‌ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేశారు. 


వ్యర్థాల నిర్వహణలో కచ్చితమైన ట్రాకింగ్, స్క్రూట్నీ, ఆడిటింగ్‌ ప్రక్రియలు చేపట్టనున్నారు. వ్యవర్థాలను ప్రాసెస్‌ చేసే విధానాలకు ప్రోత్సాహమివ్వనున్నారు. కార్యక్రమంలో మంత్రులు గౌతంరెడ్డి, పిల్లిసుభాష్‌ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, స్పెషల్‌ చీఫ్‌సెక్రటరీ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, ఏపీపీసీబి మెంబర్‌ సెక్రటరీ వివేక్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement